మౌనానివో
మాటవో
మధురమైన కవనానివో..
కలవో
కార్యానివో
చిగురాశల విరితోటవో..
భావానివో
బంధానివో
తీర్చాల్సిన బాధ్యతవో..
అనుభూతివో
ఆప్యాయతవో
అనుబంధ చందనానివో..
గమ్యానివో
మార్గానివో
ఉన్నతిని సూచించే మైలురాయివో..
నా ఆనందానికి నెలవైన నీవు
ఎవరివో స్పష్టంగా తెలియకపోయినా
నీ కొరకే నా సమయం..
నీ వైపే నా పయనం..
No comments:
Post a Comment